ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ రోజు ఆ క్షణం గుర్తుకొచ్చాయి .
ముందుకు సాగుతూ ఒక్క క్షణం వెనక్కి తల తిప్పి చూస్తే , అప్రయత్నంగా నా పెదాలపై ఓ చిరునవ్వు మెరిసి మాయమైన క్షణం .పదిలం గా మదిలో నిక్షిప్తమైన రోజది.
గమనం ఇక గమ్యం వైపే ,మళ్ళీ ఇక వెనక్కి తిరిగేది లేదు
కురిసే ఆ వర్షం ...నాలో ఆలోచనల్లా .
గర్జించే గగనం ... నాతో నాకే జరిగే ఘర్షణ లా
మెరిసే మెరుపులు ....నాలో నన్నే చూపించేలా
తడిసిన భూమి.... నా మౌనపు పరిణితిలా .
బయట వర్షం .... అతని కళ్ళల్లోనుంచి !!!
నిర్మలమైన ఆకాశం లా నా మనసు ....
ముందుకు సాగుతూ ఒక్క క్షణం వెనక్కి తల తిప్పి చూస్తే , అప్రయత్నంగా నా పెదాలపై ఓ చిరునవ్వు మెరిసి మాయమైన క్షణం .పదిలం గా మదిలో నిక్షిప్తమైన రోజది.
గమనం ఇక గమ్యం వైపే ,మళ్ళీ ఇక వెనక్కి తిరిగేది లేదు

0 comments :
Post a Comment